రచయిత రాథోడ్ శ్రావణ్ కు హైదరాబాదులో ఘన సన్మానం.

రచయిత రాథోడ్ శ్రావణ్ కు హైదరాబాదులో ఘన సన్మానం.


హైదరాబాద్: 14-అక్టోబర్ 2023 శనివారం:-  అఖిల భారతీయ బంజారా ధర్మ రచన సంఘం మరియు బంజారా రచయితల  వేదిక ఆదిలాబాద్ జిల్లా ఆధ్వర్యంలో రచయిత   రాథోడ్ శ్రావణ్  కు ఘనంగా సన్మానించారు. 

ఆల్ ఇండియా బంజారా ధర్మ రచన సంఘం  దూర విద్య కేంద్ర భవనం ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాదులో ధాడి కృష్ణా నాయక్  అధ్యక్షతన రెండు రోజుల పాటు బంజారా ధర్మ రచన గురించి  సెమినార్ నిర్వహించారు. 

ముఖ్య అతిథులుగా విచ్చేసిన రిటైర్డ్ ఐపీఎస్ అదనపు డైరెక్టర్ ఆఫ్ పోలిష్ హైదరాబాద్ డాక్టర్.డి.టి .నాయక్, మాజీ పార్లమేంట్ సభ్యులు  ధరావత్ రవీంద్రనాయక్, భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ డాక్టర్.రమేశ్ ఆర్య, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగపు ప్రోఫెసర్  డాక్టర్. శ్రీమతి సూర్యధనుంజయ్ గార్ల 
 చేతుల మీదుగా ఘనంగా పుస్తకావిష్కరణ చేసి సాలువ మెమంటో తో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఐపిస్,రిటైర్డ్ డిఐజి శ్రీ,  డా.డి.టి.నాయక్ హైదరాబాద్ గారు
మాట్లాడుతూ రాథోడ్ శ్రావణ్ గారు బంజారా భీష్మ పుస్తకం రచించడం వచ్చే సమాజానికీ మన చరిత్రను తెలియజేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. 

 భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధికారి డాక్టర్. రమేశ్ ఆర్య
 మాట్లాడుతూ హీంది తెలుగు భాషల్లో రాథోడ్ శ్రావణ్ చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు రాథోడ్ శ్రావణ్ గారు భహుభాష కోవిదులు అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో బంజారా ధర్మ రచన సంఘం సభ్యులు ఆడహక్ కార్యదర్శి డా.ఇందల్ సింగ్ బంజారా, ఉసావే అధ్యక్షులు కవన కోకిల జాదవ్ బంకట్ లాల్, ప్రో,గోనా నాయక్,ప్రో, రామ్ కోటి,ప్రో చౌహన్, బంజారా గీతామృత్ గ్రంథ రచయిత మూడ్ కృష్ణ చవాణ్,రాజేందర్ గురుజీ, ప్రధానోపాద్యాయులు తిలావత్ గోపాల్ సింగ్,  కవులు జాదవ్ మురళి,పవార్ వినోద్, చౌహన్ పరమేశ్వర్, అనుసయా, రాణాప్రతాప్ సింగ్  తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments