"తెలుగు బంధువు" అవార్డుకు సోమన్న ఎంపిక

"తెలుగు బంధువు" అవార్డుకు సోమన్న ఎంపిక

"తెలుగు బంధువు" అవార్డుకు సోమన్న ఎంపిక
--------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని కంబదహాళ్ ప్రాథమికోన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు గద్వాల సోమన్న  ప్రతిష్టాత్మక  "తెలుగు బంధువు" అవార్డుకు ఎంపికయ్యారు.బాలసాహిత్యవేత్త సోమన్నను వారి విశేష తెలుగు సాహితీ కృషి గాను,అనతి కాలంలో 43 పుస్తకాలు వ్రాసి ముద్రించినందుకుగాను తెలుగు అభివృద్ధి సమితి అధ్యక్షులు శ్రీ మేక రవీంద్ర , హైదరాబాద్  వారు సగౌరవంగా ప్రకటించి,ఆదివారం(15.10.2023) గూగుల్ మీట్ లో అందచేయనున్నారు.ఈ కార్యక్రమంలో  సభాధ్యక్షులు శ్రీ మేక రవీంద్ర గారు,  ముఖ్య అతిథిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ చొక్కాపు వెంకట రమణ గారు,విశిష్ట అతిథి ప్రముఖ కవి శ్రీ గంటా మనోహర్ రెడ్డి గారు , కార్యక్రమ సమన్వయ కర్త,విద్యావేత్త శ్రీ ఉపేందర్ గారు, కవులు,ఉపాధ్యాయులు కళాకారులు,సాహితీమిత్రులు మరియు శ్రేయోభిలాషులు పాల్గోనున్నారు.  "తెలుగు బంధువు" అవార్డుకు సోమన్న ఎంపికైనందుకు  తోటి ఉపాధ్యాయులు, గ్రామస్థులు,శ్రేయోభిలాషులు మరియు విద్యార్థులు అభినందించారు.

0/Post a Comment/Comments