"బాలసాహిత్య రత్న" బిరుదు సోమన్నకు ప్రదానం మరియు "ప్రతిబింబాలు" పుస్తకావిష్కరణ

"బాలసాహిత్య రత్న" బిరుదు సోమన్నకు ప్రదానం మరియు "ప్రతిబింబాలు" పుస్తకావిష్కరణ

"బాలసాహిత్య రత్న" బిరుదు సోమన్నకు ప్రదానం మరియు "ప్రతిబింబాలు" పుస్తకావిష్కరణ 
--------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని కంబదహాళ్ ప్రాథమికోన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు,తెలుగు బంధువు గద్వాల సోమన్నను "బాలసాహిత్య రత్న" బిరుదు వరించింది.మహర్షి వాల్మీకి సాంస్కృతిక సాహితీ సంస్థ అధ్యక్షులు,విశ్రాంత భూగర్భ గనుల శాఖ అధికారి డా.వి.డి. రాజగోపాల్,హైదరాబాద్ వారు ఈ బిరుదు ప్రదానం చేశారు.అదే కాకుండా వారు రచించిన 42వ కొత్త పుస్తకం ప్రతిబింబాలు" బాలగేయాల సంపుటి పద్మశ్రీ డా.కొలకలూరి ఇనాక్, విశ్రాంత ఫారెస్ట్ ఆఫీసర్   శ్రీ ఎ. ఎల్.కృష్ణారెడ్డి ,డా.వి.డి. రాజగోపాల్,బిక్కి కృష్ణ ,నాళేశ్వరం శంకరం మరియు రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారల చేతుల మీద  త్యాగరాయ గాన సభ,చిక్కడపల్లి,హైదరాబాద్ నందు  ఘనంగా ఆవిష్కరించారు.అనంతరం  బాలసాహిత్యవేత్త సోమన్నను వారి విశేష తెలుగు సాహితీ కృషి గాను  సగౌరవంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో  కవులు,కళాకారులు,ఉపాధ్యాయులు మరియు పాత్రికేయులు     పాల్గొన్నారు.అవార్డు గ్రహీత తెలుగు బంధువు గద్వాల సోమన్నను తోటి ఉపాధ్యాయులు, గ్రామస్థులు,శ్రేయోభిలాషులు మరియు విద్యార్థులు అభినందించారు.

0/Post a Comment/Comments