"అక్షర పద గేయాలు" పుస్తకావిష్కరణ -ప్రవాహిని న్యూస్

"అక్షర పద గేయాలు" పుస్తకావిష్కరణ -ప్రవాహిని న్యూస్

"అక్షర పద గేయాలు" పుస్తకావిష్కరణ 
--------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని కంబదహాళ్ ప్రాథమికోన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు,తెలుగు బంధువు  గద్వాల సోమన్న  రచించిన 43వ కొత్త పుస్తకం "అక్షర పద గేయాలు" బాలగేయాల సంపుటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ శ్రీ పై.విజయబాబు ,రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ శ్రీమతి పిల్లం గోళ్ల శ్రీ లక్ష్మీ, శ్రీశ్రీ కళావేదిక అధ్యక్షులు డా.కత్తిమండ ప్రతాప్ ,కవి సార్వభౌములు శ్రీనాథ వంశీయులు ష్టి కావూరి శ్రీనివాస్ మరియు గొల్లాపిన్ని సుబ్రహ్మణ్య శర్మ గారల చేతుల మీద మాకినేని బసవ పున్నయ్య కేంద్రం, గవర్నర్ పేట, విజయవాడలో ఘనంగా ఆవిష్కరించారు.ఈ పుస్తకాన్ని  మానవతావాది,యోగా గురువులు,ప్రముఖ రచయిత గొల్లాపిన్ని సుబ్రహ్మణ్య శర్మ  గారికిఅంకితమిచ్చారు.అనంతరం  బాలసాహిత్యవేత్త సోమన్నను వారి విశేష తెలుగు సాహితీ కృషి గాను సగౌరవంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కవులు,ఉపాధ్యాయులు కళాకారులు మరియు పాత్రికేయులు     పాల్గొన్నారు.పుస్తక రచయిత,సన్మాన గ్రహీత, బాలసాహిత్యరత్న గద్వాల సోమన్నను తోటి ఉపాధ్యాయులు, గ్రామస్థులు,శ్రేయోభిలాషులు మరియు విద్యార్థులు అభినందించారు.

0/Post a Comment/Comments