నిజమేగా!!- "బాలబంధు" గద్వాల సోమన్న

నిజమేగా!!- "బాలబంధు" గద్వాల సోమన్న

నిజమేగా!!
----------------------------------------
పరిమళాలు లేకుంటే
పూవులకు విలువుండునా!
చిరునవ్వు చిందకుంటే
మోములకు వెలుగుండునా!

క్షమాగుణం లేకుంటే
శత్రుత్వం తరుగునా!
ప్రేమ జల్లు  కురియకుంటే
అనుబంధం పెరుగునా!

సాహసమే చేయకుంటే
విజయాలు దరి చేరునా!
సోమరితనమే ఉంటే
అభివృద్ధి ఇల జరుగునా!

అభ్యాసం లేకుంటే
పరిపక్వత వచ్చునా!
దైవాన్ని తలవకుంటే
మోక్షం ప్రాప్తి కలుగునా!
-గద్వాల సోమన్న,9966414580 

0/Post a Comment/Comments