పై పేరు

పై పేరు

పై పేరు

పై పేరంటే 
ఇప్పటిలెక్క
టింకు బంటి పింకి బన్ని లాంటి
అర్థం పర్థం లేని పేర్లు గాదు

వాళ్ళ రంగును బట్టి
ఆకారాన్ని బట్టి
తిండిని బట్టి
చేష్ఠలను బట్టి పెట్టెటోళ్ళు 
తీట రాజిగాడని 

కొందరు
అవ్వయ్య పెట్టిన పేర్లకంటే 
పై పేర్లతోనే ఫేమస్
అట్ల పిలుత్తనే
అందరికి తెలుత్తది
అట్ల పిలుత్తే
కొందరికి గర్వం
కొందరికి బాధ

ఒకే ఇంటిపేరుగల 
ఇద్దరు ముగ్గురు మల్లయ్యలుంటే 
వాళ్ళ పేర్ల ముందు 
అవ్వ పేరో 
అయ్య పేరో తగిలిత్తరు 

ఎవ్వలు పోని ఊర్లకు
ఎవలన్న పోతె 
వాళ్ళ పేర్ల ముందట
ఆ ఊరి పేరు అతికిత్తరు 
ఢిల్లీ శంకర్

ఊళ్ళళ్ళ 
చిరుతల రామాయణం ఏసెటోళ్ళు 
ఆడోళ్ళ ఏషాలు మొగోళ్ళే ఏసుడు 
ఎవలు ఏ ఏషం కడుతే 
దానితోనే పిలిసెటోళ్ళు 
సీత కొమురయ్య 

రేషం గళ్ళోళ్ళు అనే మాటలు
చెప్పిన టైం కు జెయ్యకపోతే 
నా పేరు పై పేరు పెట్టుమని

మన నాయకులకు కూడా
పై పేర్లుంటయ్ 
ఎవ్వలకు ఏ పేర్లున్నయో 
అందరికెరుకే

                    జీగురు రవీందర్
                      9290025994

తేది:10-01-2024

0/Post a Comment/Comments