అలిశెట్టి

అలిశెట్టి


అలిశెట్టి
 ఆయన కవిత ప్రభకారుడు
 ఆస్తి కోసం కాక ఆశయం 
 అష్టకష్టాలు పడ్డ
  బతుకు కోసం ఫోటోగ్రాఫర్
  చిత్రాలు అయిన
  కవితలు అయిన
  గురితప్పక నిగ్గుతేలుస్తూ
  ఫిరంగులై పేల్చే అక్షారాలను
  మరణం జననం ఒక్కటే రోజు
  యాదృచ్చికమో,ఔన్నత్యం మో
బతుకు కోసం భాగ్యనగరం
ఆడుగులు  పడి ఆంధ్రజ్యోతి 
సిటిలైఫ్ పేరుతో మినికవితలు
భాగ్యనగరంలోని అభాగ్యుల
వెతలను, వెక్కిరింతలను
ఎక్కుపెట్టి ప్రశ్నించిన గొంతుక
తెలంగాణ సాహితీ వనం లో
పూసిన ఎర్రమందారం
సరళమైన పదాలు
రక్తం ఉడికించే మాటలతో
మరపిరంగులాంటి 
పెత్తందారీ వ్యవస్థ మీద
తిరుగుబడ్డ అక్షర సూరీడు
అల్పాక్ష రాలతోనే అక్షరాలతోనే
సమరం పూర్తి చేసి
నిర్బందాలు ఎన్ని ఎదురు అయిన చెదరని గుండె అతనిది
దోపిడీ  చిహ్నల పై మంటల
జెండాలు నాటి
అక్షరాన్ని ఎర్ర పావురాలు గా
ఎగురవేసి దశ దిశ నిర్దేశిస్తూ
పరిష్కారం చూపిన కవి
పత్రికల ఎజెండా ఏదీ అయిన
అభ్యుదయ భావాలను
ముక్కుసూటిగా చెప్పిన 
సమాజ కవి
తొంభై తొమ్మిది మంది చర్మాన్ని
వొలిచి నూరో వాడుఒక్కడే
పరుచుకునే తివాసి ఈ దేశం
లో కళా పోషణ అని భావించే
స్వార్ధ లోకానికి దూరంగా
ప్రజాసాహిత్యానికి చేరువైన
నిజమైన ప్రజాకవి
మన అలిశెట్టి
ఉమాశేషారావు వైద్య
లింగాపూర్, కామారెడ్డి
9440408080

0/Post a Comment/Comments