గత కాలపు
మంచిని మూల్లెగా
చెడును త్రుంచగా
అపజయనికి సాకులు
చెప్పక శోధించుకో తప్పులను
సవరించుకో
రేపటి నీ భవిత కోసం
నీ జీవితం నీది
నీ కోసం తీర్చిదిద్దుకో
ప్రకృతి ధర్మం
నీవు ఎలా ఉంటే
స్థితిగతులు ఉంటాయి
నీ గమ్యాన్ని ఆటంకాలు కు
బెదురక ఆత్మవిశ్వాసం
తో సాగు
కాలం నీకోసం
నా కోసం ఆగదు
మంచిని కాంక్షించు
క్యాలండర్ లో తేదీలు
మారతాయి
నీ వయస్సు పెరుగుతుంది
ఏదో ఒక తేదీ చరిత్ర కు
సంకేతం
ఆ తేదీ నీ పేరు పైన
ఉండాలి
విష్ యూ హ్యాపీ
న్యూ ఇయర్
గతం లోని మంచిని
వర్తమానం లోకి అన్వయించికొని
రేపటి భవితకు
కొత్త ఆలోచనలతో
అడుగులు వేయు
ఉమాశేషారావు వైద్య
లింగాపూర్, కామారెడ్డి
9440408080