నీటి దినోత్సవం

నీటి దినోత్సవం


జలం లేకుంటే
హాల హలం
నీరు లేకుంటే
వంటకు తంటా
ఉదరం లో మంట
నీరే ప్రాణం
సమస్త జీవరాశుల
మనుగడకు ఆధారం
అది లేకుంటే ప్రాణసంకటం
స్వచ్ఛమైన జలం లేక
ప్లోరైడ్ తో వైకల్యాలు
జలము అదే సకల కార్యయోగం
పంచభూతాల్లో ఒక్కటి
సమస్త కోటి ప్రాణాధారం
నీరు లేకుంటే జీవరాశి
మనుగడ చింత
బి.పి. తో తంటా
గృహిణి కళ్ళలో అశుధార
మేఘం మనకై వర్షించు
ప్రతి చుక్కను ఒడిసి పట్టు
పృద్విలో నిక్షిప్తమై న
జల సిరిని వృధా చేయకు
స్ఫూర్తి తో నీటి పొదుపునకు సాగు
జలాన్ని రక్షించే సైనికుడివి
కావాలి
తట్టపార పట్టు
చెరువు పూడిక తియ్యు
ఆ మట్టితో చెయ్యు చెనుకు
బలం
అది పడి పంటల నిలయం
దాచుకోవడానికి బ్యాంక్
నీటి సంరక్షణకు ఇంకుడు
గుంత
చెట్లు నాటు వర్షాన్ని కురిపించు
జలమే సమస్తం అది లేకుంటే
మానవ మనుగడ పరిసామప్తం
 ఇది పూర్తిగా నా స్వీయ రచన అని హామీ
ఇస్తున్నాను
    ఉమాశేషారావు వైద్య
     లెక్చరర్ ఇన్ సివిక్స్
     జి.జె.సి దోమకొండ


0/Post a Comment/Comments