నా పేరు గిజిగాడు!-గద్వాల సోమన్న,9966414580

నా పేరు గిజిగాడు!-గద్వాల సోమన్న,9966414580

నా పేరు గిజిగాడు!
----------------------------------------
నా పేరు గిజిగాడు
అంటారు మొనగాడు
ఇంజనీర్లకు నేనే
ఇల ఉపాధ్యాయుడు

గడ్డి పోచలు తెచ్చి
గూడు అల్లుకుంటాను
చెట్టు కొమ్మలకది
వ్రేలాడు దీస్తాను

పిల్లలను అందుంచి
ఉయ్యాల చేస్తాను
వీచే గాలికి పిలిచి
ఊపి పొమ్మంటాను

ఇంటి బాధ్యత నెరిగి
జాగ్రత్త వహిస్తా!
పిల్లాపాపలతో
కలసి ఆనందిస్తా!

మహా కవి జాషువా
పద్యాల్లో ఉన్నాను
ఆలపిస్తే చాలు
హాయిగా వింటాను

స్ఫూర్తినే ఇస్తాను
కీర్తినే తెస్తాను
ఆదర్శవంతంగా
బ్రతికి చూపిస్తాను
-గద్వాల సోమన్న,9966414580 

0/Post a Comment/Comments