నిజాల తోరణాలు- గద్వాల సోమన్న

నిజాల తోరణాలు- గద్వాల సోమన్న

నిజాల తోరణాలు
----------------------------------------
ధైర్యమే తోడుగా
గుండెలో ఉండగా
దరి చేరు విజయాలు
జరుగు ఘన కార్యాలు

విలువలే మెండుగా
బ్రతుకులో పూయగా
దక్కేను గౌరవము
ఆనందదాయకము

నవ్వులే కురియగా
మోములో విరివిగా
చిందేను అందాలు
పెరిగేను బంధాలు

జీవితం హాయిగా
సాగితే గొప్పగా
ఇల జన్మ సార్ధకము
అగునోయ్!చరితార్ధము

-గద్వాల సోమన్న,9966414580 

0/Post a Comment/Comments