మనోభీష్టం- గద్వాల సోమన్న

మనోభీష్టం- గద్వాల సోమన్న

మనోభీష్టం
----------------------------------------
గేయాల పూవులపై
తుమ్మెదనై వాలుతా!
అక్షరాల మకరందం
ఆశతోడ గ్రోలుతా!

పుస్తకాల పురుగునై
విజ్ఞానం జుర్రుతా!
మస్తకాన్ని వెలిగించి
అజ్ఞానం తరుముతా!

గురుదేవుల బోధలోని
పరమార్థం గ్రహిస్తా!
వారు చూపు మార్గంలో
అలుపెరుగక సాగుతా!

కన్నవారి ప్రేమలోని
కరుణరసం త్రాగేస్తా!
వారి సేవలలోని
దీవెనలు పొందుకుంటా!

మహనీయుల మాటలు విని
బ్రతుకును దిద్దుకుంటా!
పెద్దవారి గద్దింపులు
ప్రసాదం అనుకుంటా!
-గద్వాల సోమన్న,9966414580 

0/Post a Comment/Comments