క్రొవ్వొత్తిని నేను!-బాలబంధు గద్వాల సోమన్న

క్రొవ్వొత్తిని నేను!-బాలబంధు గద్వాల సోమన్న

క్రొవ్వొత్తిని నేను!
----------------------------------------
కరిగిపోతూ నేను కాంతినిస్తాను
తనువును బలిచేసి త్యాగమవుతాను
క్రొవ్వొత్తిని నేను! క్రొవ్వొత్తిని నేను!
చీకటిని చీల్చిచెందాడుతాను

కాలి కాలి తరిగిపోతున్నా
అగ్ని జ్వాలలకు ఆహుతి అవుతున్నా
సహనమే చూపి స్ఫూర్తినిస్తాను
ఇల్లంతా వెలుగులు నింపుతాను

అంధకారానికి నేను భయపడను
పిల్లలకు మాత్రం  ప్రియము ప్రియము
వారి పుట్టినరోజు వేడుకల్లో
పాల్గొని సేవలను చేస్తాను!

పలు రంగుల్లో దర్శనమిస్తాను
వివిధ రూపాల్లో విందులు చేస్తాను
చీకటిలో నేను చిరు దీపమవుతాను
మైనంతో తయారు చేయబడుతాను
-గద్వాల సోమన్న,9966414580 

0/Post a Comment/Comments