ఒకరు చెప్పాలా!!-'బాలబంధు" గద్వాల సోమన్న

ఒకరు చెప్పాలా!!-'బాలబంధు" గద్వాల సోమన్న

ఒకరు చెప్పాలా!!
----------------------------------------
పూలను పూయమని
పాలను త్రాగమని
ఒకరు చెప్పాలా!!
మాలను అల్లమని

తరువును  కాయమని
గురువును చెప్పమని
ఒకరు చెప్పాలా!!
యేరును పారమని

మొక్కను ఎదుగమని
చుక్కను పొడువమని
ఒకరు చెప్పాలా!!
కుక్కను మెరుగమని

సూర్యుని వెలుగమని
శూరుని గెలువమని
ఒకరు చెప్పాలా!!
చిలుకను పలుకమని

కోడెను దూకమని
కోడిని కూయమని
ఒకరు చెప్పాలా!!
కోకిలను పాడమని

గువ్వను ఎగురమని
మువ్వను మ్రోగమని
ఒకరు చెప్పాలా!!
నవ్వును మెరియమని

వానను కురియమని
వీణను మీటమని
ఒకరు చెప్పాలా!!
వేణును ఊదమని

కళ్ళను చూడమని
కాళ్ళను నడవమని
ఒకరు చెప్పాలా!!
కుళ్లును త్రుంచమని

-గద్వాల సోమన్న,9966414580

0/Post a Comment/Comments