వృద్దులారా! మేలుకోండి!!--గద్వాల సోమన్న

వృద్దులారా! మేలుకోండి!!--గద్వాల సోమన్న

వృద్దులారా! మేలుకోండి!!
----------------------------------------
జన్మనిచ్చిన దాతలు
భువిని తల్లిదండ్రులు
గాలికి వదిలేస్తే
దొరకవోయ్! దీవెనలు

కడుపులో మోశారు
కనుపాపలా చూశారు
కన్నవారు ప్రేమతో
పెంచి పెద్ద చేశారు

ఒడిలో ఆడించారు
ఎదపై లాలించారు
అట్టి కన్నవారికి
పెద్ద శిక్ష వేశారు

అవసాన దశలోన
అనాథలయ్యారు
నికృష్ట కొడుకులతో
వెల్లగొట్టబడ్డారు
(వెలి వేయబడ్డారు)

కొడుకులారా! ఏంటీ
కన్నవారికీశిక్ష!!
వృద్ధులపైనా కక్ష!!
వారే రా మన రక్ష!!

వృద్దులారా! తెలుసా!
ఈ సంతతి దారుణం!
అనాథ ఆశ్రమంలో
చేరుటకు కారణం!!
-గద్వాల సోమన్న 

0/Post a Comment/Comments