పిల్లలం మేం పిడుగులం
----------------------------------------
ఆకాశమే హద్దురా!
సాహసమే ముద్దురా!
అల్లరి చేయు పిల్లలం
ఆటల్లో పిడుగులం
యేరుల్లా పరుగు తీస్తాం
జింకల్లా గంతులేస్తాం
కనువిందే చేసేస్తాం
జలపాతమై దూకేస్తాం
కథలు బాగా వింటాం
ఇష్టమైనవి కొంటాం
స్నేహమేరా జీవితమని
బల్లగుద్ది చెప్పేస్తాం
కొంచెం భరోసా ఇస్తే
కొండలు పిండి చేస్తాం
భూలోకాన్ని చాపలా
చుట్టేసి చూపిస్తాం
ఏమైనా ఆశిస్తాం
ఏదైనా సాధిస్తాం
అంతరాలు తరిమికొట్టి
సమ సమాజం స్థాపిస్తాం
-గద్వాల సోమన్న,9966414580
----------------------------------------
ఆకాశమే హద్దురా!
సాహసమే ముద్దురా!
అల్లరి చేయు పిల్లలం
ఆటల్లో పిడుగులం
యేరుల్లా పరుగు తీస్తాం
జింకల్లా గంతులేస్తాం
కనువిందే చేసేస్తాం
జలపాతమై దూకేస్తాం
కథలు బాగా వింటాం
ఇష్టమైనవి కొంటాం
స్నేహమేరా జీవితమని
బల్లగుద్ది చెప్పేస్తాం
కొంచెం భరోసా ఇస్తే
కొండలు పిండి చేస్తాం
భూలోకాన్ని చాపలా
చుట్టేసి చూపిస్తాం
ఏమైనా ఆశిస్తాం
ఏదైనా సాధిస్తాం
అంతరాలు తరిమికొట్టి
సమ సమాజం స్థాపిస్తాం
-గద్వాల సోమన్న,9966414580