వృద్ధులు -టి.వి.యెల్. గాయత్రి

వృద్ధులు -టి.వి.యెల్. గాయత్రి


*వృద్ధులు*

సీసం /

వృద్ధులు దీనతన్ వేదన నొందుచు
గడుపుచు నుందురీ కాలమందు
బిడ్డల కోసము విత్తము నిచ్చుచు
రక్తమాంసాదులఁ రంగరించి
పెంచి పెద్దలఁ జేయ పెరవారటంచును (పేచీలతోవారి)
తూలనాడుట పెద్ద దోష మద్ది
రెక్కలరిగిపోవ లేవని దుస్థితి
దాపురించెనకట!దయను జూపి/

తేటగీతి /

ప్రేమ మీరగ కాచెడి పిల్ల లెచట?
కాన రాకుండిరీ దుష్ట కలియుగమున
బాధ్యతల్ విడనాడుచు పరుల వోలె
మిన్నకుందురు పిల్లలు మిడిసి పడుచు.//

మత్తకోకిల /

కన్న వారిని కష్ట పెట్టుచు కాసు కోసము వ్యర్థులై
పిన్న లీభువి యందు పర్వులు పెట్టు చుండగ హీనులై
చిన్న బోవుచు పెద్ద లందరు చింతతో దిగులొందగన్
పున్నెమే విధి వచ్చు నిప్పుడు పూజ్యులన్ విడనాడగా!//

తేటగీతి /

దైవరూపులుగా తల్లి
దండ్రులిద్ధాత్రిని
నిలిచి యుందురు వృద్ధులై నెనరు తోడ
ప్రేమ మమతలపంచుచు   పెద్దలయెడ
పిల్లలు మెలయంగ వలయు పెద్ద మదిని//

-టి.వి.యెల్. గాయత్రి,
పూణే. మహారాష్ట్ర.

0/Post a Comment/Comments