కడిగిన ముత్యాలు-గద్వాల సోమన్న

కడిగిన ముత్యాలు-గద్వాల సోమన్న

కడిగిన ముత్యాలు
----------------------------------------
నోటిలోని పలుకులు
యేటిలోని జలములు
కనువిందే చేయును
నీటిలోని కలువలు

నింగిలోని చుక్కలు
నేల మీద మొక్కలు
ఇల పరోపకారులు
వజ్రాల ముక్కలు

ప్రేమలొలుకు మనసులు
మంచి చేయు మనుషులు
బహు గౌరవనీయులు
భువిలో గురుదేవులు

విహరించే ఖగములు
వికసించే పూవులు
మనసులు మురిపించును
ప్రవహించే  యేరులు

పుడమిపైన తరువులు
కాలే క్రొవ్వొతులు
త్యాగానికి గురుతులు
కన్నవారి సేవలు

కడుపునింపు రైతులు
అందమైన పల్లెలు
ఆరాధన పాత్రలు
బుద్ధి చెప్పు పెద్దలు

-గద్వాల సోమన్న,9966414580 

0/Post a Comment/Comments