జలం ప్రాణం _గంగాజమున దడివె

జలం ప్రాణం _గంగాజమున దడివె



జల-ప్రాణం 

ప్రాణుల మనుగడ నీతోనే 
విశ్వమంతటా నీవు లేకనే
జీవుల ఉద్దీపన భూమి పైనే
మూడొంతులు నీ సామ్రాజ్యమే
మానవుల తప్పులతో నీవు దూరమే
జీవులకు జలం ప్రాణమని
హరి పాదాన పుట్టి జలజల జారి 
శివుడి నెత్తిన ఎక్కావట 
నీ తోబుట్టువులంతా మా జీవనదులే
అయినా మా తప్పులతో ఆకాశ గంగమ్మను 
కిందికి దించలేకపోతున్నాము
నీవు భూమిని తాకాలంటే 
నీ మిత్రులు తరువులు ఉండాలి 
మేమేమో ఆధునిక మోజులో చెట్లన్నీ నరికితిమి.
అన్నదాతలు పాతాళ గంగమ్మను పైకి తేలేని 
పరిస్థితులు మేమే తెచ్చి పెడ్తిమి
లెక్కకు మించి బోరులు తవ్వి 
మొదటికే మోసం తెస్తిమి 
అయినా నారుపోసిన ప్రకృతి 
ఇంకా నీరు పోసి ప్రాణాలు పోస్తూనే ఉంది.

రచన: గంగాజమున దడివె 
వృత్తి: టీచర్ 
మోర్తాడ్.జిల్లా: నిజామాబాద్.TG

0/Post a Comment/Comments