పునీత -గంగాజమున దడివె

పునీత -గంగాజమున దడివె



పునీత 


అగ్ని పరీక్ష లో సీత అయింది పునీత 
ఆకలి తీర్చి ఆయువు పోసే అగ్ని 
ఆయువు తీరాక ఉత్తకట్టె ను కలిపేసుకునేను
అగ్నే అంకితం ఖాండవ దహనంలో..
యజ్ఞ యాగాలలో దైవమై..
మంచి చెడులు తనలో కలిపేసుకుని
తారతమ్యాలు లేకుండా అన్నీ 
బూడిద చేసే ధర్మ యుక్తమైన 
పంచభూత ప్రకృతి ధర్మం అగ్ని 
నిప్పుల్లో నిఖార్సత నిగ్గు తేలేను
మనుగడ పెంచే జఠరాగ్ని 
దూరముంచాలి బడబాగ్ని 
పంచభూతాల్లో శుబ్రతనిచ్చి
పదునాలుగు భువనభాండాలను 
శుద్ది చేసి బుద్ధి వికసింపచేసే
అగ్ని దైవమా పునీతమైన భూతదయ 
మా మీద ఉంచుము..!!

రచన: గంగాజమున దడివె 
వృత్తి: టీచర్ 
మోర్తాడ్.జిల్లా: నిజామాబాద్.TG

0/Post a Comment/Comments