ఆఖరిరోజు _గంగాజమున దడివె

ఆఖరిరోజు _గంగాజమున దడివె


ఆఖరిరోజు 


బాధల బంధీలకు దూరముగా..

మనసును మభ్యపెట్టకుండా...

బాధపడిన సన్నివేశాలను అణిచి వేసి

బాధపడే సందర్భాలకు 

నిశ్శబ్ద తోవ వేసి 

ఎవరికోసమో 

నేను హైరానా పడకుండా 

ఎందులోనూ

మనసును ఇరికించకుండా

ఆందోళనల 

ఇరుసులో ఇరుక్కోకుండా

భోళాతళనంకు పోయి

బోకె పట్టుకోకుండా 

నన్ను నేను 

రక్షించుకునేందుకు 

నేను ఎదుర్కొన్న సంఘర్షణలే పాఠాలుగా 

నా మనసు తగిలిన గాయాలే లేపనంగా 

అర్హత లేని స్నేహాలకు చరమగీతమై

దెప్పి పొడుపులకు 

ఆమడ దూరమై 

నా బాధ అర్థంకాని చెలిమికి 

చంచల స్వరూపాలకు

అందనంత దూరం నేనే జరిగిపోతూ 

బాధల భయాలకు ఇదే ఆఖరి రోజు 


- గంగాజమున దడివె

టీచర్

మోర్తాడ్, నిజామాబాద్0/Post a Comment/Comments