అంగీకారమా!- గద్వాల సోమన్న

అంగీకారమా!- గద్వాల సోమన్న

అంగీకారమా!
----------------------------------------
మనసు మేఘాలలోన
తేలి తేలి పోదామా!
ఆనంద సీమలోన
పరవశమై పోదామా!

జీవితమను తోటలో
హాయిగా గడుపుదమా!
పెద్దవారి బాటలో
గమ్యాన్ని చేరుదామా!

అమ్మ చెప్పు మాటలో
దీవెనలు పొందుదామా!
నాన్న ప్రేమ ఊటలో
అమృతాన్ని సేవిద్దామా!

గురుదేవుల బోధలో
విజ్ఞానం జుర్రుదామా!
స్నేహమను బంధంలో
తావి ఆఘ్రాణిద్దామా!
-గద్వాల సోమన్న,9966414580 

0/Post a Comment/Comments