స్ఫూర్తిదాతలు కడలి కెరటాలు- గద్వాల సోమన్న

స్ఫూర్తిదాతలు కడలి కెరటాలు- గద్వాల సోమన్న

స్ఫూర్తిదాతలు కడలి కెరటాలు
----------------------------------------
ఎగసిపడే కెరటాల
పోరాటమే గొప్పది
తీరం చేరాలనే
ఆరాటం సడలనిది

పడి పడి లేచి లేచి
దరిని ముడ్డాడుతాయి
ఆటంకాలెదురైనా
ప్రయత్నమే చేస్తాయి

అపజయాలు వచ్చినా
విజయాలు వరిస్తాయి
సముద్రపు అలలు మనకు
పూర్తి స్ఫూర్తినిస్తాయి

నిరంతర ప్రయత్నాలు
విజయానికి మార్గాలు
అహర్నిశల సాధనలు
పరిపూర్ణత సాధనాలు
-గద్వాల సోమన్న,9966414580 

0/Post a Comment/Comments