ఓదార్చింది...!

ఓదార్చింది...!



ఓదార్చింది...!

కన్నతల్లి... 
పురిటి నొప్పులు...
ఎంత పడ్డదో...
కానీ...
అది తల్లికెరక...
బిడ్డ ఎదుగుదలకు...
నాన్న...
ఎంత తిప్పలు పడ్డాడో...
తన కాలిపాదాల...
చెప్పుల కెరక...
అమ్మ ఒత్తిళ్లలో...
ఆదమరిచి... 
నా ఎదపై...
ఆడుతూ ఆడుతూ...
నన్ను...
నిద్ర లేకుండా చేసినా...
ఆనందానికి...
అవధులు లేకుండా చేసింది...! ఎదిగిన కొద్దీ...
ఒదిగిన నా చిన్నారి...
నడి ఇంట్లో...
ఆడుతూ...
అల్లరి చేస్తూ...
నన్ను పరిగెత్తిస్తూ...
సందడి చేస్తూ...
హరివిల్లు ఊయలలో... 
ఊగుతూ ఉంటే...
నేను ఆకాశమై..
నా చేతులతో...
ఊపుతూ...
అంతులేని...
ఆనందానికి... 
రెక్కలు తొడుక్కొని...
ఊరేగాను...!
కంటికి రెప్పలా...
కాలికి చెప్పులా...
క్షణక్షణం ...
నా హృదయం ...
పరితపిస్తూ...
రక్షణ కవచమై... 
ధైర్యాన్ని నూరిపోస్తూ....
అంతకంతకు... 
ఒదిగి....
ఎదిగేలా చేస్తూ... 
కన్నతల్లిలా...
ధైర్యాన్నిస్తూ...
నా కష్టాలు...
తన కష్టాలుగా... 
నా వెన్నంటే ఉంటూ...
అనుక్షణం...
నా గురించే...
ఆలోచించే...
నా తల్లి...
నేను కన్నా చిన్నారి...
నా హృదయ వాకిలి...
పుట్టింటిని...
విడిచి..
మెట్టింటికి...
వెళుతూ ఉంటే...
నా దేహంలోని... 
అణువణువు...
కన్నీటి ధారలై...
వర్షిస్తుంటే...
నా కంటి పాపను...
ముద్దాడిన కన్నీరు..
నా కన్న పాపను..
కౌగిలించుకొని
ఓదార్చింది...!

_ కొంపెల్లి రామయ్య( యామిని తేజశ్రీ )ఖమ్మం
చరవాణి :70 32 50 46 46

0/Post a Comment/Comments