దాబా మీద జ్ఞాపకాలు- గద్వాల సోమన్న

దాబా మీద జ్ఞాపకాలు- గద్వాల సోమన్న

దాబా మీద జ్ఞాపకాలు
----------------------------------------
చూడు చూడు చుక్కలు
చక్కనైన చుక్కలు
నింగిలోన మిలమిల
మెరిసేటి తారకలు

గుంపుగా ఉంటాయి
చెదరిపోయి ఉంటాయి
ఎంచక్కా మనసులు
రంజింపజేస్తాయి

చుక్కల రాత్రుల్లో
ఎంతో హాయి! హాయి!
గగనంలో వింతలు
గాంచునోయ్! కనుదోయి!

మా ఇంటి దాబాపై
ప్రతి రాత్రి వేడుకలు
కథలు,కబుర్లతో
ఉల్లసించు వీనులు

-గద్వాల సోమన్న,9966414580 

0/Post a Comment/Comments