ఎన్నికలలో

ఎన్నికలలోఎన్నికలలో
సామాన్యుడి ఆశలకు
విమానపు రెక్కలు తొడిగి
అలవికాని హామీల వర్షం లో
తడిపి ముద్దచేసి
కులమతల వాసనలు అట్టించి
బందుత్వపు గొడుగుకింద
చల్లబర్చి
ఏక్ దిన్ కా సుల్తాన్ గా మారుస్తారు
సీసా సీసా కు చిత్రాలు మార్చి
పొద్దున ఒకపార్టీ సాయంత్రం
మరో పార్టీ ఊసరవెల్లి కూడా
జడుసు కునేంత
ఓటు ప్రగతికి మెటు
ఓటు అమ్మకు
రాజ్యాంగం కల్పించిన వరం
ఓటు చైతన్యం తో
అక్రమార్కుల కు చెక్ పెట్టు
ఒక్క ఓటు అని నిర్లక్ష్యం వద్దు
నీవు అచేతనుడవు అయితే అడుకుంటాయి
చేతనుడవు అయితే తలోగ్గుతాయి
ఇది పూర్తిగా నా స్వీయ అని హామీ ఇస్తున్నాను

ఉమ్మాశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ పాలిటిక్స్
జి.జె.సి.దోమకొండ
9440408080

0/Post a Comment/Comments