ప్రబోధ గీతిక-ప్రాశస్త్య మాలిక-గద్వాల సోమన్న

ప్రబోధ గీతిక-ప్రాశస్త్య మాలిక-గద్వాల సోమన్న

ప్రబోధ గీతిక-ప్రాశస్త్య మాలిక
----------------------------------------
హృదయాల్లో నెమ్మది
ఉంటేనే మంచిది
లేకుంటే మనిషిక
అవుతాడు ఉన్మాది

ఆనందం మనసున
ప్రవహిస్తే ఉగాది
విలువలు క్షీణిస్తే
మిగులుతుంది సమాధి

మాటపై నిలబడిన
అదెంతో గొప్పది
విలువెంతో బ్రతుకున
ఎన్నటికీ పోదది

చేతలు మృగ్యమైన
ఎంతున్నా వట్టిది
మాటలు ఎక్కువైన
ఫాయిదా ఏమున్నది!
-గద్వాల సోమన్న,9966414580 

0/Post a Comment/Comments