తెలుగు పదాల పదనిసలు
----------------------------------------
చేయి చేయి కల్పిస్తే
సమైక్యత పూస్తుంది
మనసు మనసు కలిస్తే
మమకారం పుడుతుంది
రాయి రాయి తాకితే
నిప్పు రాసుకుంటుంది
మాట మాట పెరిగితే
వాగ్వాదమవుతుంది
చుక్క చుక్క ఒడిసిపడితే
నీరు ఆదా అవుతుంది
ముక్క ముక్క అతికితే
పూర్తి రూపమొస్తుంది
పదం పదం పేర్చితే
వాక్య నిర్మాణమవుతుంది
అడుగు అడుగు వేస్తే
గమ్యం చేరవవుతుంది
-గద్వాల సోమన్న,9966414580
----------------------------------------
చేయి చేయి కల్పిస్తే
సమైక్యత పూస్తుంది
మనసు మనసు కలిస్తే
మమకారం పుడుతుంది
రాయి రాయి తాకితే
నిప్పు రాసుకుంటుంది
మాట మాట పెరిగితే
వాగ్వాదమవుతుంది
చుక్క చుక్క ఒడిసిపడితే
నీరు ఆదా అవుతుంది
ముక్క ముక్క అతికితే
పూర్తి రూపమొస్తుంది
పదం పదం పేర్చితే
వాక్య నిర్మాణమవుతుంది
అడుగు అడుగు వేస్తే
గమ్యం చేరవవుతుంది
-గద్వాల సోమన్న,9966414580