జ్ఞాపకాల దొంతరలు- గద్వాల సోమన్న

జ్ఞాపకాల దొంతరలు- గద్వాల సోమన్న

జ్ఞాపకాల దొంతరలు
----------------------------------------
ఈ చిన్ని జీవితంలో
ఎన్నెన్నో జ్ఞాపకాలు
కొన్నేమో విషాదాలు
ఇంకొన్ని తేనె ధారలు

గుర్తుకు వస్తుంటాయి
ఉక్కిరిబిక్కిరి చేస్తాయి
జ్ఞానకాల గాలిలోన
తేలి తేలి పోతుంటాము

అందరికి ఉంటుంటాయి
ఎనలేని మధురోహాలు
కొన్ని మోదాన్ని ఇస్తాయి
కొన్ని ఖేదాన్ని  తెస్తాయి

జ్ఞాపకాల వానలోన
తడిచి తడిచి పోదామా!
పదిలంగా గుండెలోన
వాటిని  దాచుకుందామా!
-గద్వాల సోమన్న,9966414580 

0/Post a Comment/Comments