తెలుగు తల్లికి వందనము- గద్వాల సోమన్న

తెలుగు తల్లికి వందనము- గద్వాల సోమన్న

తెలుగు తల్లికి వందనము
----------------------------------------
తెలుగు తల్లికి వందనము
మాతృమూర్తికి వందనము
"దేశ భాషలందు లెస్స"
తెలుగు భాషకు వందనము

లలిత లావణ్య పదాలకు
చక్కని నుడికారాలకు
అందాల తెలుగు భాషకు
అహర్నిశలూ వందనము

తేనెలొలుకు తల్లి భాషకు
వీణ నాదమైన భాషకు
హృదయ పూర్వక వందనము
వాన సమమైన భాషకు

సంగీతానికి అనువైన
చమత్కారాలకు నెలవైన
గొప్పదైన తేటతెలుగుకు
ప్రణమిల్లి సేతు వందనము

తెలుగు భాష గొప్పదనము
మాతృభాష చక్కదనము
ఎలుగెత్తి చాటాలోయ్!
గళమెత్తి పాడాలోయ్!
-గద్వాల సోమన్న,9966414580 

0/Post a Comment/Comments