మీరన్న చెప్పురి...! - కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ )

మీరన్న చెప్పురి...! - కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ )


 మీరన్న చెప్పురి...!

ఎవడురా నీ వన్నది?
ఏందిరా... నీ పొగరన్నది?
ఏళ్లు గడిచిపోయిన...
నీ జాతి గౌరవం ఎక్కడ?
నీ దేశ ఖ్యాతి ఎక్కడ?
ఎక్కడ నీ స్వతంత్రం అని...
భరతమాత ప్రశ్నిస్తున్నది...!

కులం కుళ్ళు లో మునిగి నీవు...
మతం మత్తులో కరిగినీవు...
రాజకీయపు ఎత్తుగడలో...
మణిపూర్ లో తిష్ట వేసి...
ఆదిమ జాతుల ననచివేసి...
అమ్మతనాన్ని పాత రేసి...
ఆడుతున్నవు ఏందిరా? అని...
భరతమాత ప్రశ్నిస్తున్నది...!

రాజకీయపు రంకుతో...
రాజ్యమేల బొంకుతో...
నోట్ల కట్టల సంకెళ్ళతో...
ఓట్లు కొల్లగొట్టుతూ...
దొడ్డిదారి రాజకీయం...
దోచుకునే కాలం...
ఇంకెన్నాళ్లు రా? అని...
భరతమాత ప్రశ్నిస్తున్నది...!

స్వాతంత్రం వచ్చిందని...
సంకలు గుద్దుకున్నావురా...
అర్థరాత్రి ఆడది...
తిరిగే రోజు వచ్చిందని...
పట్టపగలైన...
తిరిగే రోజు వచ్చిందా...
పడతిని నగ్నంగా...
ఊరేగిస్తుంటే...
పరిరక్షించే...
రక్షణ ఎక్కడ...
ప్రశ్నించే గొంతులు...
బతికి బట్ట గట్ట గలవా...
గతి తప్పిన రాజ్యంలో...
మతి ఎక్కడ ?అని...
భరతమాత ప్రశ్నిస్తున్నది...!

పుచ్చిపోయిన...
చచ్చు పట్టిన...
వెన్ను విరిగిన...
యువకులంతా...
గంజాయికి బానిసలై...
గల్లి గల్లి లో తిరుగుతుంటే...
దోపిడీలకు అలవాటై...
రోడ్డున పడి...
దోచుకుంటుంటే...
ప్రజాస్వామ్యం ఎక్కడ...
ప్రసంగాలకే పరిమితమై...
కళ్ళుండి చూడలేని...
కబోది రాజ్యంలో...
కనువిప్పు కలిగేది...
ఎప్పుడు రా? అని...
భరతమాత ప్రశ్నిస్తున్నది...!

పోరాటం చెయ్యందే...
స్వాతంత్రం వచ్చిందా...
బరి గీసి నిలవందే...
తెలంగాణ వచ్చేదా...
మరి....
ఇప్పుడేంది...
సమ్మె వద్దు...
సమరం వద్దు...
హక్కులకై మర్ల పడితే...
దేశద్రోహం అంటరేంది...
ఇదేందన్నా కిరికిరి...
జర మీరన్న చెప్పురి...!

_ కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ )ఖమ్మం
చరవాణి :7032504646

0/Post a Comment/Comments