చిన్నారి హావభావాలు- గద్వాల సోమన్న

చిన్నారి హావభావాలు- గద్వాల సోమన్న

చిన్నారి హావభావాలు
----------------------------------------
చిన్నారి నవ్వులు
విరిసిన మరు మల్లెలు
వెలసిన హరివిల్లులు
కురిసిన  విరిజల్లులు

కళ్ళేమో తారలు
పలుకేమో తేనెలు
అందమైన రూపము
వెలుగులీను దీపము

నోటిలోన పెట్టిన
చూడు చూపుడు వ్రేలు
చిరు గాలికి లేచిన
నాట్యమాడే కురులు

మేలి పుత్తడి బొమ్మ
లేత మామిడి కొమ్మ
ఒక్కసారి చూస్తే
కనువిందే చేయును
-గద్వాల సోమన్న,9966414580 

0/Post a Comment/Comments