బాలల ధీమా!! - గద్వాల సోమన్న

బాలల ధీమా!! - గద్వాల సోమన్న

బాలల ధీమా!!

ఆకాశ దేశంలోన
మేఘాల పల్లకీలోన
చంద్రమండలం చూస్తాం
సాహస కార్యాలు చేస్తాం

పాలపుంతను దర్శిస్తాము
నవ గ్రహాలను స్నేహిస్తాము
ఖగోళ రహస్యాలను మేం
శోధిస్తాం ఇక ఛేదిస్తాం!

భారత దేశపు ఖ్యాతిని
నలుదిశలా చాటేస్తాము
ఎవరూ చూపని నీతిని
ఎల్లెడలా చూపిస్తాము

గొప్ప గొప్ప పనులు చేసి
మెప్పును మేమే తెస్తాము
తప్పులు దిద్ది  గురువుల్లా
నిప్పులాగ జీవిస్తాము

-గద్వాల సోమన్న,9966414580 

0/Post a Comment/Comments