బాల వాక్కు-బ్రహ్మ వాక్కు- గద్వాల సోమన్న

బాల వాక్కు-బ్రహ్మ వాక్కు- గద్వాల సోమన్న

బాల వాక్కు-బ్రహ్మ వాక్కు
----------------------------------------
ఆకులు లేని తరువులు
జలములు లేని చెరువులు
వెలవెల పోవునోయి!
నగవులు లేని ముఖములు

పిల్లలు లేని గృహములు
పైరులు లేని పొలములు
వెలవెల పోవునోయి!
విలువలు లేని బ్రతుకులు

కలువలు లేని కొలనులు
సుమములు లేని వనములు
వెలవెల పోవునోయి!
అమావాస్య రాత్రులు

గురువులు లేని చదువులు
భావన లేని కవితలు
వెలవెల పోవునోయి!
మమతలు లేని మనసులు
-గద్వాల సోమన్న,9966414580 

0/Post a Comment/Comments