అమ్మ - యడ్ల శ్రీనివాసరావు

అమ్మ - యడ్ల శ్రీనివాసరావు


అమ్మ 
- యడ్ల శ్రీనివాసరావు
   విజయనగరం


ఇలలో వెలిసిన దైవం
అనురాగాల అమృత రూపం

భవబంధాల అతీత గమ్యం
ఈ ప్రపంచానికి అమ్మ సర్వం

అమ్మతనం ఆదిదేవత రూపం
దైవానికి జన్మనిచ్చిన పర్వం

నవ మాసాలు మోస్తున్న జీవం
రక్తం పంచి జన్మనిస్తుంది సర్వం

ఆప్యాయతకు పెట్టిన దీపం
అనుబంధాల ప్రేమకు బంధం

కదలాడే దేవత రూపం
కరుణించే కమనీయ కర్మం

ఆమె కన్నీరు రక్తంల దిద్దుకుని
మన జీవానికి ప్రమిదల కరిగేది

నేను ఏడిస్తే తల్లడిల్లుతుంది
నేను నవ్వితే మురిసిపోతుంది

నా విజయం తన విజయం
నా అసక్తత ఆమె విఫలం

మాతృమూర్తి నీకు వందనం
మా జీవితానికి నీవే  నందనం

దేశభక్తి చాటుదాం
కన్నతల్లికి చేతులెత్తి మ్రొక్కేదం

నాలో జీవం నీవిచ్చిన తేజం
నీవు లేని చోట నిలువు నీడ శూన్యం

అనునిత్యం నీడలా గర్భాన చూస్తుంది 
అనురాగంతో పెంచుతుంది

నా పుణ్యబలం నా మాతృమూర్తి
అని గొంతు ఎట్టి చాటిదా 
ఏ దేశం ఏగిన

సృష్టికి ప్రతి సృష్టి అమ్మ
ఆమె లేని సృష్టి లేదు అమ్మ

ప్రేమ మూర్తి అమ్మ
ఆది దేవత నిజం అమ్మ

రెండక్షరాల అమ్మ పదం మధురం
రెండు జన్మలు కాదు ఎన్ని జన్మలైనా చెరిగిపోని జన్మం

అమ్మకు సాటి ఈ లోకాన లేరు
ఆమెకు సాటి ఆమె మరి

అమ్మ దీవెన అపురం
ఆమె ప్రేమ మధురం

సహనశీలివమ్మా! సాదృశ్యం అమ్మ! 
కనికరము కలిగిన కారణ జన్మరాలు అమ్మ! 

0/Post a Comment/Comments