మా బుజ్జి పాపాయి-గద్వాల సోమన్న

మా బుజ్జి పాపాయి-గద్వాల సోమన్న

మా బుజ్జి పాపాయి
----------------------------------------
మా బుజ్జి పాపాయి
అందరికి కనుదోయి
మా ఇంట వెలసిన
నిండు పున్నమి రేయి

నట్టింట నడిస్తే
సిరిమువ్వల రవళులు
గట్టిగా ఏడ్చిస్తే
మనసులు విలవిలలు

బొజ్జ నింపే వేళ
మారాము చేస్తుంది
అల్లంత దూరాన
నిలిచి రమ్మంటుంది

గోరు ముద్దలతోడ
కడుపు నింపుకుంటుంది
జోలపాట పాడితే
ఇక నిదురపోతుంది

చిన్నారి నవ్వితే
ఇంటిలోన కళకళ
మింటిలోన తారలా
మెరిసేను మిలమిల

పాపాయి మాటలు
సెలయేరుల గలగల
మా చిట్టి నడకలు
నెమలమ్మ కులుకులు

బుంగ మూతి పెడితే
జాబిలమ్మ అందము
పసి పాపతో మాకు
అంతులేని బంధము

సదనంలో వేడుక
మాకేమో కానుక
అందాల బాలిక
మందార మాలిక
-గద్వాల సోమన్న,9966414580 

0/Post a Comment/Comments