పిల్లలం-పిడుగులం- గద్వాల సోమన్న

పిల్లలం-పిడుగులం- గద్వాల సోమన్న

పిల్లలం-పిడుగులం
----------------------------------------
వెలుతురు తోటలోన
మమతల కోటలోన
విహరించు పిల్లలం
విరబూయు మల్లెలం

పువ్వుల వానలోన
నవ్వుల వీణలోన
తడిచి పోవు బాలలం
ధ్వనించే రవళులం

తులసి వనంలోన
సొగసుల కోనలోన
అందాల మొక్కలం
మందార పూవులం

గృహమనే దివిలోన
మనోహర భువిలోన
పారిజాత తావులం
నవజాత శిశువులం

సాహస వాడలోన
సరదాల ఓడలోన
మేమే బుడుతలం
చిచ్చర పిడుగులం

-గద్వాల సోమన్న,9966414580 

0/Post a Comment/Comments