హితవు- గద్వాల సోమన్న

హితవు- గద్వాల సోమన్న

హితవు
----------------------------------------
అద్దంలాంటి మనసులను
ముక్కలు ముక్కలు చేయకు
నమ్మకమైన మిత్రులను
జీవితాన వదలకోకు

మేలులు చేసిన వారికి
కృతఘ్నతను చూపబోకు
జన్మనిచ్చిన వారికి
కంట తడి పెట్టించకు

ఆశ్రయమిచ్చిన వారికి
అన్యాయం చేయబోకు
ఆశ్రయించిన వారికి
అభియోగాలు మోపకు

పచ్చని కాపురాల్లో
నిప్పులు పోయ చూడకు
అసూయ ద్వేషాలలో
నిన్ను తగలబెట్టకోకు

అందని వాటి కోసము
అహర్నిశలు శ్రమించకు
అవసరమైన వాటిని
ఏమాత్రం మరచిపోకు

క్షణికావేశాలతో నువ్వు
బంధాలను త్రెంచుకోకు
అపార్థాలను సృష్టించి
కారుచిచ్చు రగిలించకు
-గద్వాల సోమన్న,9966414580 

0/Post a Comment/Comments