నర్సమ్మ ప్రబోధం
----------------------------------------
చెప్పినట్లు వింటే!
ఆరోగ్యం వెంటే!
కంటి నిండా నిదుర
బొజ్జ నిండా తింటే!
అమ్మ చెప్పే మాట
అది బంగారు బాట
ఎప్పుడు దాట రాదు
చప్పుడు చేయ రాదు
జ్వరమొస్తే మందులు
వేసుకున్న మంచిది
శ్రద్ధగా చదివితే
బహుమానం గొప్పది
ఆరోగ్యం భాగ్యము
బ్రతుకుల్లో సౌఖ్యము
ఆశ్రద్ద వద్దు! వద్దు!
మెళుకువలు ముద్దు! ముద్దు!
బాగుగా చదువుకో!
భవిష్యత్తు దిద్దుకో!
సంస్కారం బ్రతుకున
మక్కువతో నేర్చుకో!
కన్నవారికి పేరు
తేవాలి! తేవాలి!
నలుగురికి నీ నోరు
ఊరట కల్గించాలి!
----------------------------------------
చెప్పినట్లు వింటే!
ఆరోగ్యం వెంటే!
కంటి నిండా నిదుర
బొజ్జ నిండా తింటే!
అమ్మ చెప్పే మాట
అది బంగారు బాట
ఎప్పుడు దాట రాదు
చప్పుడు చేయ రాదు
జ్వరమొస్తే మందులు
వేసుకున్న మంచిది
శ్రద్ధగా చదివితే
బహుమానం గొప్పది
ఆరోగ్యం భాగ్యము
బ్రతుకుల్లో సౌఖ్యము
ఆశ్రద్ద వద్దు! వద్దు!
మెళుకువలు ముద్దు! ముద్దు!
బాగుగా చదువుకో!
భవిష్యత్తు దిద్దుకో!
సంస్కారం బ్రతుకున
మక్కువతో నేర్చుకో!
కన్నవారికి పేరు
తేవాలి! తేవాలి!
నలుగురికి నీ నోరు
ఊరట కల్గించాలి!
-గద్వాల సోమన్న,9966414580