రాజకీయ ఎన్నికలు.... శ్రీపాల్

రాజకీయ ఎన్నికలు.... శ్రీపాల్

ఐదేళ్లకోసారి అచ్చె ఎన్నికలు 
ఎప్పుడూ కనపడని మొఖాలు
అయ్యా ,అవ్వ అంటూ 
బాగోగులు అరుసుకునే
ఏం కావాలి నీకంటూ 
నేనున్నా అనుకుంటూ 
మురిపెముగా మాట కలిపే 
సిత్రంగా నా గుడిసె తాకే...
ఒక్కడెనుక ఒక్కడచ్చె
ఓటుకు వంద డబ్బు ఇచ్చే 
మందు సీసా ఇప్పించే 
మర్మమేంటో  సూపించే 
తెల్లారితే ఓట్లంటూ 
నేనున్నా నీకంటూ 
కలలేన్నో సూపించి 
ఓటు సిరను అంటించి 
ఓటు ఏసి తిరిగే లోపే 
నడి బజారులో వదిలేసే 
నడి సంద్రంలో ముంచేసే ....
వాడెక్కెను గద్దె మీద 
వాగ్దానాలన్ని మరిసి
కూడబెట్టె డబ్బులేన్నొ
కూడు లేదని నేనడిగితే
డబ్బులీయ లేదా నీకంటూ 
మందు తాగలేదా నీవంటూ
కడుపు మీద కొట్టి వాడు 
అందలమే ఎక్కె చూడు 
రాజకీయ ఎన్నికల 
సూడు సూడు సిత్రాలు....

...శ్రీపాల్...


0/Post a Comment/Comments