ఆహ్వానం…
పంచ భూతములపై ‘వచన కవిత’ లకు ఆహ్వానం
గడువు: 06.05.2024 - 10.05.2024
సోమవారం - శుక్రవారం వరకు రోజుకో అంశము
తేదీ: 06.05.2024 - గాలి
తేదీ: 07.05.2024 - నీరు
తేదీ: 08.05.2024 - నిప్పు
తేదీ: 09.05.2024 - భూమి
తేదీ: 10.05.2024 - ఆకాశం
సమయం: ఉ.8:00గం. - రా.8:00గం.
నియమాలు
- రచనలను “ప్రవాహిని” వాట్సాప్ సమూహం నందు పోస్ట్ చేయాలి.
- ఇతర సమూహాల లో పోస్ట్ చేసిన రచనలను ప్రవాహిని సమూహం నందు పోస్ట్ చేయకూడదు.
- సమూహానికి సంబంధంలేని విషయాలు పోస్ట్ చేసినచో వాట్సాప్ సమూహము నుండి తొలగించబడతారు.
- రచనలు మంచి ఎత్తుగడతో ఆరోగ్యకరమైన వాతావరణంలో కొనసాగాలి.
- దీర్ఘ వాక్యాలు, పదబంధాలు లేకుండా సరళంగా, సకలజన సమ్మతమైన రీతిలో రచనలు వుండాలి.
- 15-20 వరుసల లోపు లేదా 100 పదాలు మించకుండా వుండాలి.
- పై నిబంధనలు పాటించనిచో రచనలు పరిశీలనకు తీసుకోబడవు.
- అక్షర దోషాలు లేకుండా ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని,
- ఏ వరుస/పాదం లో పదాలు ఎంత వరకు వుండాలో చూసి తెలుగులో టైపు చేసి పంపాలి.
- రచనల ఎంపికలో తుదినిర్ణయం నిర్వాహకులదే. ఎలాంటి వాదోపవాదాలకు, విమర్శలకు తావులేదు.
- ఎంపిక మరియు ప్రచురణ విషయంలో ఎలాంటి సంప్రదింపులు జరుపవద్దు.
- వివాదాస్పద అంశాలపై రచనలు చేయకూడదు. రచనలు విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు.
- ఒకవేళ అలాంటి రచనలు చేస్తే వాటి వివాదాల పూర్తి బాధ్యత ఆరచయితలదే.
- రచనలు ప్రజా జీవితానికి అద్దం పట్టేవిగా వుండాలి. ప్రజల మనోగతాన్ని పలికించాలి.
- రచనలకు శని, ఆది వారాలలో ప్రశంసా పత్రాలు అందజేయడం జరుగుతుంది.
- రచనలలో ఎంపికైన వాటిని మా వెబ్సైట్ https://www.pravahini.in లో పబ్లిష్ చేయడం జరుగుతుంది.
శీర్షిక:
రచన:
పూర్తి పేరు:
వృత్తి:
పూర్తి చిరునామా:
చరవాణి సంఖ్య: